May 11,2023 19:47

బీమా డబ్బులు అందిస్తున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
వైఎస్‌ఆర్‌ బీమా పథకం పేదలకు అండగా నిలుస్తోందని ఆదోని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. మండలంలోని ఆరెకల్‌ గ్రామానికి చెందిన యోహాను ఈఏడాది జనవరిలో బాణసంచా పేలుస్తూ మృతి చెందారు. గురువారం వైఎస్‌ఆర్‌ బీమా కింద రూ.5 లక్షలను మృతుని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచేలా వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమలు చేస్తున్నారన్నారు. ఎంపిడిఒ గీతావాణి, సర్పంచి లోహిత స్వామి, వైసిపి సీనియర్‌ నాయకులు తిమ్మారెడ్డి, ప్రకాష్‌, రాముడు, సచివాలయ సిబ్బంది హనుమేష్‌ పాల్గొన్నారు.