Nov 14,2023 18:47

ఆహారం పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దావగూడూరుకు చెందిన కీ.శే.కంచర్ల వెంకటేశ్వర్లు కుమారుడు కీ.శే శ్రీని వాసులు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణ వీధుల్లోని యాచకులు, నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు ఉన్నారు.