Sep 06,2023 20:07

భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం... అనే నినాదంతో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీ కష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ సభ్యుని సహకారంతో పట్టణ వీధుల్లో తిరుగుతూ ఉండే యాచుకులకు నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు అల్పాహారం ఏర్పాటు పంపిణీ చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు సేవాహ్రదయ రవ్వా శ్రీనివాసులు శ్రీ వాసవి సత్ర సముదాయాల మీడియా ఛైర్మన్‌ చక్కా వెంకట కేశవ రావు, చక్కా చైతన్య గుప్తా, జయవరపు కిషోర్‌ పాల్గొన్నారు.