ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు : 'ఆకలికి అందరూ బంధువులే'' అనే నినాదంతో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో గురువారం పేదల కోసం కందుకూరులో వద్ధులను, వికలాంగులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమ నిర్వహిస్తున్నట్లు ఫౌం డేషన్ సెక్రెటరీ షంషేర్ తెలిపారు. ప్రెసిడెంట్ సాజిద్,ట్రజరర్ హఫీజ్,ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్ పాల్గొన్నారు.










