May 10,2023 22:48

పిబిదేవం వద్ద గోదావరి కాల్వను పరిశీలిస్తున్న డిపిఒ, పిసిబి ఇఇ బృందం


ప్రజాశక్తి - కాకినాడ
పేద ప్రజలకు నాణ్యమైన అత్యాధునిక వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపి వంగా గీతఅన్నారు. కాకినాడ దుమ్ముల పేటలో రూ 1.39 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైయస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ వంగా గీత, ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, కలెక్టర్‌ కృతికాశుక్ల ఇన్చార్జి జెసి, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, ఎస్‌పి సతీష్‌ కుమార్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాకినాడ సీపోర్ట్స్‌ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెవి రావు సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చారన్నారు. ట్రస్ట్‌ ఆసుపత్రి తరపున ముగ్గురు వైద్యులను అక్కడి సేవల కోసం వినియోగించేందుకు ఆస్పత్రి యాజమాన్యం ఆమోదం తెలిపిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇఎస్‌ఐ ఆసుపత్రి కూడా మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుందన్నారు. రూ 110 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి శరవేగంగా నిర్మాణం అవుతుందన్నారు. కార్యక్రమంలో కౌడా చైర్‌ పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైసిపి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ,, మాజీ డిప్యూటీ మేయర్లు పసుపులేటి వెంకట లక్ష్మి, చోడిపల్లి సత్యప్రసాద్‌, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.