Nov 18,2022 23:57

మాట్లాడుతున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి-అనకాపల్లి
పేదవారి సొంత ఇంటి కల నిజం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇళ్లను నిర్మిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మండలంలోని కోడూరు పంచాయతీలో 1300 జగనన్న ఇళ్లు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 1 లక్ష 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని, ఇందులో అనకాపల్లి జోన్‌లో 6 వేలు ఇళ్లు ఉన్నాయని చెప్పారు. 6 నుంచి 8 నెలల వ్యవధిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి, జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, కార్పొరేటర్లు మందపాటి సునీత, పీల సౌజన్య రాంబాబు, కొణతాల నీలిమ భాస్కర్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి నాయకులు మందపాటి జానకి రామరాజు, దంతులూరి దిలీప్‌కుమార్‌, మళ్ల బుల్లిబాబు, పలక రవి, దంతులూరు శ్రీధర్‌ రాజు, గ్రామ సర్పంచ్‌ సేనాపతి లక్ష్మి శ్రీనివాస్‌, తహశీల్దారు గంగాధర్‌ రావు పాల్గొన్నారు.