Oct 12,2023 20:39

శిలాఫలికాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే చింతల

కలికిరి : ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని కలెక్టర్‌ గిరీష, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జగనన్న కాలనీ ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో జగనన్న కాలనీల రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ సొంత ఇంటి కల కోసం పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సొంతింటి కల నెరవేర్చడం కోసం జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఏడు లక్షల ఇళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రారంభోత్సవం చేయడం గర్వకారణమని కొనియాడారు. ఒక్కొక్క గహం విలువ రూ.2.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా చేస్తుందని తెలిపారు. జగనన్న గహాలు లబ్ధి పొందినటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడారు. జగనన్న కాలనీలో సౌకర్యాలు సంపూర్ణంగా మెరుగుపరిచి రోడ్లు, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర ముఖ్యమైన సౌకర్యాలను కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందుందని దాన్ని మీరు గుర్తించాలని కోరారు. జిల్లాలోని ప్రతి లేఔట్‌లోనూ మౌలిక వసతులు ఉండేటట్లు చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలోనే ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం పూర్తి అవుతుందన్నారు. లేఔట్‌ లలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలన చేసి లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సకాలంలో సిమెంటు ఇసుక, వంటి మెటీరియల్‌ అందజేసి త్వరితగతిన లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించడం జరిగిందన్నారు. దేశంలో ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగని రీతిలో మన రాష్ట్రంలో జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అర్హులందరికీ పెన్షన్లు రేషన్‌ కార్డులు ఇవ్వడంతోపాటు ప్రతి నెల ఒకటవ తేదీనే అవతాతలకు తలుపు తట్టి పెన్షన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా సామూహిక గహప్రవేశ మహోత్సవంలో భాగంగా నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను కలెక్టర్‌, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వారు ఇళ్లను పరిశీలించి లేఅవుట్‌లో మొక్కలు నాటారు. అనంతరం కాలనీ గహాలను ప్రారంభించి నీటి కులాయిలు, విద్యుత్‌ వీధి దీపాలు వెలిగించి, శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్హాన్‌ అహ్మద్‌ ఖాన్‌, హౌసింగ్‌ పీడీ సాంబశివ, గహ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ కారపాకల భాస్కర్‌ నాయుడు, మాజీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ నల్లారి తిమ్మరెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి అగ్ర మొహిద్దిన్‌, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రెడ్డివారి ప్రతాప్‌ కుమార్‌, ఎంపిడిఒ గంగయ్య యాదవ్‌, తహశీల్దార్‌ భాగ్యలత, జడ్‌పిటిసి పద్మజా లోకవర్ధన్‌, ఎంపిపి వేంపల్లి నూర్జహాన్‌, ఎస్సీ సెల్‌ కార్యదర్శి వి.హరి, మండల కన్వీనర్‌ చింతల రమేష్‌రెడ్డి, సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి నాయకులు మధు రెడ్డి, హనీఫ్‌, ఖాదర్బాషా, నరేష్‌, సమీర్‌ పాల్గొన్నారు