ప్రజాశక్తి - గణపవరం
పేదల సొంతింటి కల నెరవేర్చడమే జగనన్న లక్ష్యమని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. సోమవారం స్థానిక జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పురోగతిని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడికీ గూడు కల్పించడం కోసం జగన్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. లేఅవుట్‌లో నీరు, విద్యుత్ సౌకర్యాలపై దృష్టి సారించి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో గణపవరం సర్పంచి మూరా అలంకారం, వైసిపి నేతలు దండు రాము, చనుమూరి శివప్రసాద్, మాదేటి సురేష్, కొండేటి వెంకటరత్నం పాల్గొన్నారు.










