Oct 14,2023 00:22

పేదల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజాశక్తి-కార్వేటినగరం: పేదల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ఉద్ధేశం అని ఎంపిపి లతబాలాజి అన్నారు.
శుక్రవారం మండలంలోని ఎంఎం.విలాసం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పవన్‌, ఎంపీటీసీ దేశమ్మ, నాయకులు చందురాజు బాలాజీ, ధనంజయవర్మ, అధికారులు పాల్గొన్నారు.
యదమరి: మండలంలోని కెనటంపల్లి సర్పంచ్‌ డేనియ ఆధ్వర్యంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివరాజ్‌, సి హెచ్‌ఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: మండలంలోని మొగిలి సచివాల యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రామాన్ని ఎంపిపి అమరావతి పర్యవేక్షించారు. డాక్టర్‌ రోహిత్‌ చంగల్‌ రాయులు, సర్పంచ్‌ మనోహరి, ఎంపీటీసీ శ్యా మల అధికారులు పాల్గొన్నారు.
పెద్దపంజాణి: మండలంలోని పెద్దవెలగటూరు సచి వాల పరిధిలో సర్పంచ్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బాగారడ్డి, తమ్మిరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు హాజరైనారు.
బైరెడ్డిపల్లి: మండలంలోని తిమ్మేపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎంపిపి రెడ్డప్ప పాల్గొని పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాలకష్ణప్ప గౌడ్‌, జడ్పిటిసి కేశవులు, ఎంపీటీసీ నాగరాజు, ఎంపీడీవో రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.