మాట్లాడుతున్న మంత్రి మెరుగు నాగార్జున
ప్రజాశక్తి- కొల్లూరు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని చిన్న పులివర్రు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు, రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










