May 03,2023 23:25

స్థానికులతో మాట్లాడుతున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి- అమృతలూరు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని గోవాడ గ్రామంలో మానమ్మకం జగనన్నే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాపర్ల నరేంద్ర కుమార్‌ , వైసిపి మండల అధ్యక్షుడు ఎలవర్తి సురేష్‌, మోదుకూరి హరిబాబు ,దేవస్థానం చైర్మన్‌ సిహెచ్‌ విసి.చౌదరి, ఎంపిటిసి దేవరకొండ శ్రీనివాసరావు, వైసిపి గ్రామ అధ్యక్షుడు మండవ శ్రీరామమూర్తి, బలిజేపల్లి శివ నాగమల్లేశ్వరరావు, కోపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ బంధిలి చెత్తయ్య, చందోలు సుందర్రావు, నలుకుర్తి సుధాకర్‌ , దేవరకొండ సత్యవతి, మునిపల్లి జకరయ్య,నూతలపాటి సురేష్‌ ,పావులూరి సుబ్బారావు, తాడికొండ సీతారామయ్య పాల్గొన్నారు.