Apr 18,2023 00:25

స్టిక్కరు అంటిస్తున్న మంత్రి సురేష్‌

ప్రజాశక్తి-పెద్దారవీడు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర మున్సిపల్‌ మరియు పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మండల పరిధిలోని చట్లమిట్ల గ్రామంలో మా భవిష్యత్తు జగనన్నే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సమక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించారు. గృహ యజమానుల అనుమతితో స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రచగొర్ల వెంకటసుశీల, పిచ్చయ్య యాదవ్‌, మండల సచివాలయ కన్వీనర్‌ ఏరువ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచులు బలుసుపటి నాగరాజు, పొందుగల వెంకటరెడ్డి, మూల వెంకటరమణరెడ్డి, ఎంపిటిసిలు పోటు గంగయ్య, గొదపు చంద్రబాబు, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ శొంఠి నాగార్జునరెడ్డి, వైసిపి నాయకులు వజ్రాల ఆదిరెడ్డి, రెల రమణరెడ్డి, తిరుమలనాధస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్‌ దుద్దెల వెంకటరెడ్డి, బొచ్చు వెంకటేశ్వర్లురెడ్డి, సచివాలయ కన్వీనర్లు, గహసారథులు పాల్గొన్నారు.