Sep 12,2023 23:54
అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న కరణం వెంకటేశ్‌

ప్రజాశక్తి-చీరాల: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని వైసిపి చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ తెలిపారు. పేరాల శృంగార పేటలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వెంకటేష్‌ గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌ బాబు, అర్బన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండ్రు బాబ్జి, ఆర్‌బికె చైర్మన్‌ కావూరి రమణారెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్‌ యాతం జ్యోతి, యాతం మేరీబాబు, సునీల్‌, గొర్రెముచ్చు జోహానమ్మ, మేరుగు ఇస్సాక్‌, యండ్రపాటి సంగీత్‌, గొర్రెముచ్చు ఏలియా, గారపాటి సుబ్బారావు, గొర్రెముచ్చు ఇజ్రాయెల్‌, పాలపర్తి జక్క, గొర్రెముచ్చు రాజేష్‌, మల్లెల జక్రయ్య, మల్లెల లలితా రాజశేఖర్‌, బత్తుల అనిల్‌, కంపా అరుణ్‌, కలవకూరి యానాదిరావు, గొట్టిపాటి ఎబినేజర్‌, మించాల సాంబశివరావు, కోలా శివ, షేక్‌ కబీర్‌, షేక్‌ మహిమూద్‌, షేక్‌ రియాజ్‌, షేక్‌ సుభాని, చిలుకోటి శ్రీను, మామిడాల సుబ్బారావు, వాసిమల్ల బ్రదర్స్‌, జంగా ప్రేమ్‌ కుమార్‌, ఆసాది అంకాలరెడ్డి, ధనుంజయ పాల్గొన్నారు.