Feb 18,2023 01:31
గణపవరంలో ప్రజలతో శాసనసభ్యులు కోన రఘుపతి

ప్రజాశక్తి-కర్లపాలెం: పేదల సంక్షేమమే థ్యేయంగా సిఎం జగన్‌ పని చేస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. శుక్రవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో సంక్షేమ పథకాల పుస్తకా లను శాసనసభ్యులు కోన రఘుపతి మండల నాయకులుతో కలిసి పంపిణీ చేశారు. గణపవరం గ్రామానికి మంచినీటి సమస్య ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం రూ.89 లక్షలు ఈ గ్రామానికి మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఈ గ్రామానికి వివిధ పథకాలు ద్వారా 14 కోట్ల రూపాయలు ఇచ్చి నట్లు తెలిపారు. అదేవిధంగా మెయిన్‌ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పోర్టు పనుల వల్ల పాడయినంది. కర్లపాలెం నుండి పెదపులుగు వారిపాలెం వరకు దాదాపు మూడున్నర కోట్లు గవర్నమెంట్‌ దగ్గర నుంచి అప్రూవల్‌ తీసుకున్న ట్లు తెలిపారు. డబల్‌ రోడ్డు కింద కర్లపాలెం ఎన్‌హెచ్‌ నుంచి పెదపులుగు వారి పాలెం వరకు మంజూరు చేశారన్నారు. రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు, మండల కన్వీనర్‌ సీతారామరెడ్డి, సర్పంచులు దేవరకొండ అంకమ్మ, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు నాగలక్ష్మి, షేక్‌ ఆసిఫ్‌ ఆలీ, కో ఆప్షన్‌ సభ్యులు అమీర్‌ బేగ్‌, నాయకులు పేరాల వెంకట సురేష్‌, మందపాటి పరమానంద కుమార్‌, శామ్యూల్‌ జాన్‌, శివారెడ్డి, నాగరాజురెడ్డి, షేక్‌ తాజ్‌, ఏడుకొండలు, బెనర్జీ, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.