ప్రజాశక్తి -మద్దిపాడు : పేదల సంక్షేమే థ్యేయమంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నట్లు ఎంపిపి వాకా అరుణా కోటిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గుండ్లాపల్లి గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అరుణా కోటిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రజలు ఎన్నడూ చూడని అభివద్ధి వైసిపి పాలనలో చూస్తున్నామన్నారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు అప్పారావు, సర్పంచి కొప్పోలు ఆంజనేయులు, ఎంపిటిసి పద్మకుమారి, ఘడియపుడి సర్పంచి రామాంజనేయులు, సీనియర్ నాయకులు తేళ్ళ పుల్లారావు, ఎంపిడిఒ శ్రీనివాసరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చీమకుర్తి : మండల పరిధిలోని మంచికలపాడు గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు, జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, వైఎస్ ఎంపిపి జె. శ్రీనివాసరావు, జెసిఎస్ మండల కన్వీనర్ చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి మాట్లాడారు. మంచికలపాడు గ్రామంలో రూ.18 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు మళ్లీ జగన్మోహనరెడ్డికి అండగా నిలవాలన్నారు. అనంతరం అభివృద్ధి పనులకు సబం ధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి సొసైటీ అధ్యక్షుడు జి. ఓబులరెడ్డి, వైసిపి మండల నాయకుడు జి.ఓబులరెడ్డి, సర్పంచి పి. నాగేశ్వరరావు, ఎంపిటిసి అంకయ్య, సుబ్బారావు, వెంకటేశ్వరరెడ్డి, సుగుణరావు, రమేష్ పాల్గొన్నారు.