ప్రజాశక్తి- సంతమాగులూరు : పేదల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కష్ణ చైతన్య తెలిపారు. మండల పరిధిలోని పాత మాగులూరు గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వైసిపి నాయకులు కష్ణ చైతన్యకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కృష్ణ చైతన్య వాలంటీర్లు, నాయకులు, అధికారులతో కలిసి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ కరోనా కష్టకాలం లోనూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. టిడిపి మహానాడులో చంద్రబాబు చెప్పిన మోసపూరిత మేనిఫెస్టోను రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరూ నమ్మరన్నారు. సంక్షేమ పాలనకు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్ చింతా రామారావు, ఓరుగంటి కోటిరెడ్డి, నాగబోతు రామాంజ నేయులు, ఓబులరెడ్డి, జిర్రా విజయబాబు, వి ముసరా రెడ్డి, బండి కోటిరెడ్డి, కష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు.










