తంబళ్లపల్లి : రాజకీయ పార్టీలకు అతీతంగా పేదల సంక్షేమమే సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో భాగంగా మండలంలోని కోసు వారిపల్లె పంచాయతీలోని కొప్పులోలపల్లి, గుమ్మడికాయలపల్లి, ఎర్రోళ్లపల్లి, ఆనిగా నిపల్లి, వడ్డేపల్లి, చిట్కలపల్లి, పాయి లోలపల్లి, పెద్దగుట్టపల్లి, సింగారెడ్డి గారివారి పల్లి, నల్ల తిమ్మారెడ్డి గారిపల్లి, చిన్నరెడ్డివారి పల్లెల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రభుత్వ పనితీరుపై అడిగి తెలుసు కున్నారు. సమస్యలను ఆలకిస్తూ వాటిని పరిష్కరించే దిశగా ఆయా శాఖల అధికా రులను ఆదేశించారు. సుపరిపాలన కోసం మరోసారి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్య మంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి రఘునాథ్, ఎంపిటిసి సభ్యురాలు శ్యామల కోటిరెడ్డి, నాయకులు శివశంకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, వైస్ ఎంపిపి, రామ్మూర్తి, శివారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భార్గవ్‌రెడ్డి, అభివద్ధి కమిటీ చైర్మన్ నారా యణరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










