నిమ్మనపల్లి : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నవాజ్‌భాషా పేర్కొ న్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నాదని అన్నారు. సోమవారం నిమ్మ నపల్లి పంచాయితీలోని తురకపల్లి, కొత్త ఇండ్లు, బోడిబండవారిపల్లి, కొత్తపల్లి, దేవళం కురవపల్లిలో స్థానిక వైసీపీ పార్టీ నాయకులు విజరుకుమార్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఎంపిపి నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్ రెడ్డి, మండల వైసిపి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రమణారెడ్డి, మండల సచివాలయాలకు కన్వీనర్ రామమోహన్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరాల బ్రౌచర్ ను లబ్ధిదారులకు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా పొందిన సాయాన్ని చదివి వివరించారు. స్థానిక సమస్యలను అడిగి నేరుగా తెలుసుకున్నారు. అధికారుల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాల్లో అవసరమైన రోడ్లు, సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, మంచినీటి కొళాయిలు ఏర్పాటు, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరు, రెవిన్యూ సమస్యలను ఎమ్మెల్యే దష్టికి ప్రజలు తెచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి జయప్రకాష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్‌రఫీ, సర్పంచులు సుబ్రమణ్యం, చండ్రాయుడు, మహాదేవరెడ్డి, నాయకులు సదాశివరెడ్డి, యుగంధర్ రెడ్డి, హేమంత్, నరేంద్రరెడ్డి, శశిధర్ రెడ్డి, నవీన్, తహశీల్దార్ సిఆర్.మంజుల, ఎంపిడిఒ శేషగిరిరావు, డిటి.సిరాజుద్దీన్, ఎస్‌ఐ.రా మకష్ణ, పాల్గొన్నారు. కలకడ : ఎమ్మెల్యే చింతల ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొ న్నారు. సోమవారం మండలంలోని దిగుతాండ పంచాయతీ దిగుతాండ ఎగువుతాండ గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి పాల్గొన్నారు. ఎగువ తాండాలో నీటి సమస్య తీర్చేందుకు బోర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్, తహశీ ల్దార్ ప్రదీప్, ఎంపిడివో పరమేశ్వర్ రెడ్డి, కొన సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, వైస్ ఎంపిపి, ఏనుగోండ ఈశ్వర్ నాయుడు,మండల స్థాయి అధికా రులు, సెక్రెటరీ జయచంద్ర, సచివా లయం సిబ్బంది పాల్గొన్నారు.










