ప్రజాశక్తి - ముదినేపల్లి
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు (డిఎన్‌ఆర్) అన్నారు. మండలంలోని కొరగుంటపాలెంలో ఆదివారం గడపగడపకూ మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో..లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థతో గ్రామాల ముంగిటకు పాలనను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదేనన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడి సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపిపి సునీత, రాధా, పార్టీ మండల కన్వీనర్ ఎం.ఏసుబాబు, గ్రామ సర్పంచి పేరే రామకృష్ణ, గ్రామ ప్రముఖులు అచ్యుత రాంబాబు, ఇఒపిఆర్‌డి టివి.సారధి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ, వైసిపి నాయకులు, కార్యకర్తలు గ్రామప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరగుంటపాలెం గ్రామ మాజీ సర్పంచి బత్తుల వీరవెంకట చిరంజీవి సోదరులు బత్తుల శేఖర్, బత్తుల నాగరాజు, మాజీ ఎంపిటిసి సభ్యులు నాయుడు రవీంధ్రనాద్‌ఠాగూర్, సాగిరాజు ఆంజనేయరాజు వైసిపిలో చేరారు. వీరికి ఎంఎల్‌ఎ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.










