
కంభంవారిపల్లి : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదరిక నిర్నూలన కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరొన్నారు. మండలంలోని కెవి పంచాయతీ కుమ్మరపల్లిలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి ఉత్సాహంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, భోజన వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగి సంక్షేమ ఫలాలు రాకుంటే స్థానిక సచివాలయాలలో సంప్రదించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలు అందిం చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పాలన కోసం మరోమారు వైసిపిని ఆదరించి ముఖమంత్రిగా మరల జగన్మోహన్‌రెడ్డిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకట రమణారెడ్డి, జడ్‌పిటిసి గజ్జల సతీష్‌రెడ్డి, సర్పంచ్ ఎర్ర మరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎల్లయ్య, సీనియర్ నాయ కులు ఎర్రమరెడ్డి, నాగ సిద్ధారెడ్డి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
సిసిరోడ్డు నిర్మాణానికి భూమిపూజ
మండలంలోని గర్నిమిట్ట పంచాయతీ పరిధిలోని చింతమేకలపల్లిలో రూ.5 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మా ణానికి ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జివి. శ్రీనాధరెడ్డి, మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, జడ్‌పిటిసి గజ్జలశతి, సీన్‌రెడ్డి, ఎంపిపి ఈశ్వరమ్మ, సీనియర్ నాయకులు సికె ఎర్రంరెడ్డి, సర్పంచ్ రమణమ్మ, మైనార్టీ నాయకులు పఠాన్, సైపుల్లా పాల్గొన్నారు.