Jul 11,2023 21:40

విద్యార్థితో మాట్లాడుతున్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సంబేపల్లె(రాయచోటి) : పేదల సంక్షేమాభివద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ఆడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సంబేపల్లె మండలంలోని దేవపట్లగ్రామం అంబేద్కర్‌ కాలనీ, నాగిరెడ్డిగారిపల్లె సచివాలయ పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీలో మంగళవారం డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిపి ఆవుల నాగశ్రీలక్ష్మీ, మాజీ జడ్‌పిటిసి ఉపేంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకట రమణారెడ్డి, ఆవుల మల్లికార్జున రెడ్డి, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ వడ్డీ వెంకట రమణారెడ్డిలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డి ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలును వివరిస్తూ సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతానికిపైగా అమలుచేయడంతో ప్రతి ఇంటా సంక్షేమ బావుటా ఎగురుతోందని పేర్కొన్నారు. సంక్షేమాభివద్ధిలో సిఎం జగన్‌ సరికొత్త అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మహేశ్వరిబాయి, ఎంపిడిఓ నరసింహులు, వైస్‌ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు, వివి ప్రతాప్‌ రెడ్డి, మాజీ వైస్‌ ఎంపిపి నాగారంజాన్‌వలీ, సర్పంచులు ఉష యువరాజు నాయుడు, అంచల రామచంద్ర, రఘునాథరెడ్డి, దండు నాగభూషన్‌రెడ్డి, వెంకట రమణనాయక్‌, ఎంపిటిసిలు భద్రయ్య, శ్రీధర్‌ రెడ్డి, కాకులపల్లె రమణా రెడ్డి, నాయకులు తిక్కం ఆనందరెడ్డి, చికెన్‌ మహబూబ్‌బాష, సైఫుల్లా, పీరయ్య, పాల నారాయణ నాయుడు,, వాయల్పాటి ఆనంద్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.