Nov 05,2023 00:33

సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే కృష్ణదాస్‌

ప్రజాశక్తి- పోలాకి: పేదప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం దీర్ఘాశి పంచాయతీ పరిధిలో కింజరాపువానిపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను అవగాహన కల్పించారు, అలాగే సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిఇసి సభ్యులు ధర్మాన పద్మప్రియ, డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగినాయుడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, సర్పంచ్‌ మెండ సుమంగళి కృష్ణ్ణ, ఎంపిటిసి ప్రతినిధి పాకోటి తాతబాబు అధికారులు పాల్గొన్నారు.