Aug 10,2023 21:23

వృద్ధుడికి బుక్‌లెట్‌ను అందజేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

సాలూరు: పట్టణంలోని 18వ వార్డు పరిధిలో గల చిన కుమ్మరి వీధి, దుర్గానవీధి, నాయుడువీధుల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పథకాల మంజూరుకు సంబంధించిన సమాచారంతో కూడిన బుక్లెట్లను ఇంటింటికి పంపిణీ చేశారు. సంక్షేమ సహాయకులు కుటుంబాలకు అందిన ప్రయోజనాలను చదివి వినిపించారు. లబ్ధిదారులతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, తద్వారా సామాజిక హౌదా రావాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. పేదల సొంతింటి కల సాకారం కావాలని, జిల్లాలో దాదాపు 24 వేల ఇళ్లు మంజూరు చేశారని, పార్వతీపురం, సాలూరులో ఏపీ టిడ్కో పక్కా ఇళ్లను నిర్మిస్తోందని చెప్పారు. ఇళ్లను పూర్తి చేసేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. గృహాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, లబ్ధిదారులు గృహ ప్రవేశం త్వరగా చేస్తే చూడాలని వేచి చూస్తుందన్నారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వైఎస్‌ఆర్‌ కల్యాణ మస్తు పథకం కింద బుధవారం 697 జంటలకు రూ.4.95 కోట్ల ఆర్థిక సాయం జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ పువ్వుల శ్రీనివాస్‌ భరత్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, సీనియర్‌ నాయకులు జర్జాపు సూరిబాబు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకష్ణ, మాజీ కౌన్సిలర్‌ కొల్లి వెంకటరమణ, వైసిపి నాయకులు చొక్కాపు గోపి, పతివాడ శివ పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలోని కడగండి సచివాలయం పరిధిలో గురువారం పెద్ద వంగర, పొల్లం గూడ, చిన్నవంగర, గొలికుప్ప గూడ, రోలిగుడ్డి, సారంగి, సారంగి కొత్తగూడ, తోతలు గూడ, మొక్కరాయిమానుగూడ, కోడిపిల్ల గూడ, గౌరిపాలెం, చిన్నగౌరిపాలెం, బెంజిరి గూడ, మోన్‌ పాయి, రాయిమనుగూడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సవర లక్ష్మి, ఎంపిపి బిడ్డిక.ఆదినారాయణ, వైస్‌ ఎంపిపి కూరంగి సరస్వతి, స్థానిక సర్పంచులు సవర సువార్త, నిమ్మక సింహాచలం, కొండగొర్రి కుమారి, సర్పంచులు ఆరిక కళావతి, హిమరక ఆదిలక్ష్మీ, సున్నపురం రవి, గొయిది ఎంపిటిసి నిమ్మక హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.