Apr 09,2023 00:03

వెలిగండ్లలో జగనన్నే మాభవిష్యత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుర్రా

ప్రజాశక్తి వెలిగండ్ల : పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తెలిపారు. మండల పరిధిలోని మొగులూరు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఇంటి యజమానుల అనుమతి మేరకు గృహాలకు జగనన్న స్టిక్కర్లు అంటించారు .ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి గుంటక తిరుపతిరెడ్డి, మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతి రెడ్డి, జార్జీ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ తాత పూడి దేవసహాయం, తాతపూడి సురేష్‌, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు పొల్ల సుబ్రహ్మణ్యం, నాగూర్‌ యాదవ్‌, కన్వీనర్‌ గజ్జల వెంకటరెడ్డి, గంజి రవీంద్రారెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు ఎలికా రమణయ్య , కె. వెంకటరామయ్య, రైతు సేవా అధ్యక్షుడు తమ్మినేని శివరామిరెడ్డి, ఎంపీటీసీ దేవి రెడ్డి జనార్దన్‌ రెడ్డి, సర్పంచి మోపూరు లక్ష్మి,, మోపురి కోటేశ్వరరావు, బొబ్బ వెంకటరెడ్డి, వాలంటీర్లు, గహ సారధులు పాల్గొన్నారు. బల్లికురవ రూరల్‌ : మండల పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌,బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చింతల పేరయ్య, మండల జెసిఎస్‌ ఇన్‌ఛార్జి టి,నరేష్‌, జడ్‌పిటిసి చింతల అంజలి, శ్రీనివాస్‌, శీనువలి, జెసిఎస్‌ ఇన్‌ఛార్జులు, గ్రామ సర్పంచి, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గహ సారథులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. కర్లపాలెం : మండల పరిధిలోని యెట్రవారిపాలెం గ్రామంలో జగనన్నే మా భవిషత్‌, మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ కన్వీనర్ల సంఘం మండల కన్వీనర్‌ సమ్మెట వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జగనన్నే మా భవిషత్‌ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చీరాల వెంకటలక్ష్మి, ఎంపిపి యారం వనజ, జడ్‌పిటిసి పిట్ల వేణుగోపాల్‌ రెడ్డి, ఎంపిటిసి తాండ్ర సాంబశివరావు, గ్రామ సచివాలయ కన్వీనర్‌, గృహ సారధులు, వాలంటీర్లు పాల్గొన్నారు. రేపల్లె : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని జడ్‌పిటిసి బొర్రా లక్ష్మీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, వాలంటీర్లు, వైసిపి. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.