
ప్రజాశక్తి-చీమకుర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డే అవుతారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. చీమకుర్తి-5 సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యాక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పదల సంక్షేమానికి సిఎం జగన్ నిరంతర కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. తిరిగిజగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే టిజెఆర్. సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగనన్న పాలనలో సుభిక్షంగా ఉన్నారన్నారు. అనంతరం మెప్మా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు కె. శేఖరరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా అంకులు,వైస్ చైర్మన్ బి. వెంకటరెడ్డి, కౌన్సిలర్లు తప్పెట బాబూరావు, డి. వెంకటరావు, భీమన వెంకటరావు, గోపురపు రాజ్యలక్ష్మి, కమిషనర్ ఎస్‌కె.ఫజులుల్లా పాల్గొన్నారు.దర్శి : అర్హులలకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ మహేష్ తెలిపారు. దర్శి-3 సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని కౌన్సిలర్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. మండల పరిధిలోని చౌటపాలెంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి దాసరి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్పొరేషన్ డైరక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, జెసిఎస్ పట్టణ కన్వీనర్ ఎదురు కోటిరెడ్డి, చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, ఎఎంసి చైర్మన్ షకిలా, బుజ్జి, నాయకులు మారం శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, ఎంపిటిసి రత్నం, ఎంపిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు చక్రవర్తి, సునీత తదితరులు పాల్గొన్నారు. పిసిపల్లి : మండల పరిధిలోని ముద్దపాడులో సర్పంచి మూలే అరుణ అధ్యక్షతన రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి అత్యాల జఫన్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి జగన్‌ని ముఖ్యమంత్రి చేయాలన్నారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓకే రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ శీలం సుదర్శన్ రావు, వైసిపి నాయకులు మూల రాజశేఖర్ రెడ్డి, మూల రమణారెడ్డి ,పంచాయతీ కార్యదర్శులు కిరణ్ కుమార్, సౌజన్య పాల్గొన్నారు. కొనకనమిట్ల : మండల పరిధిలోని చినమనగుండం గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎంపిపి మురళీ కష్ణ, జడ్‌పిటిసి అక్కిదాసరి ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంటిఇంటికీ తిరిగి ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ మోర శంకర్‌రెడ్డి, సచివాలయ కన్వీనర్ సూరవరపు వెంకటరెడ్డి, సర్పంచి వడ్లమూడి ముర, ఎంపిటిసి కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపిపి ఉన్నం శ్రీనువాసులు, నోడల్ అధికారి రావూరి జనార్థన్, పంచాయతీ సెక్రటరీ నాగార్జున పాల్గొన్నారు కనిగిరి : మండల పరిధిలోని చిన్న ఇర్లపాడులో జగనన్నే రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి దంతులూరి ప్రకాశం, జడ్‌పిటిసి మడతల కస్తూరిరెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమ కోసం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగనన్నే సిఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ సంగు సుబ్బారెడ్డి, సర్పంచి దీనమ్మ, బాబు, మిట్ట రమేశ్, యూత్ నాయకుడు సంగటి మహేంద్రరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ మల్లికార్జున రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బూత్ కన్వీనర్లు, గహ సారధులు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, వాలంటీర్లు పాల్గొన్నారు.