ప్రజాశక్తి - పంగులూరు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ,రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచిన కష్ణ చైతన్య తెలిపారు. మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం బుధ వారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కృష్ణచైతన్య గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తేళ్ళ నాగమ్మ, జడ్‌పిటిసి రాయిని ప్రమీల, మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, మండల అభివద్ధి కమిటీ అధ్యక్షుడు రాయిని వెంకట సుబ్బారావు, కోటపాడు గ్రామ సర్పంచి నారాయణమ్మ, ఎంపిటిసి సామ్రాజ్యం, మాజీ సర్పంచి, వైసిపి నాయకులు ఎర్రం గోపాల్ రెడ్డి, సుబ్బారెడ్డి ,నల్లమల అజిల్, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










