ప్రజాశక్తి-రాజవొమ్మంగి
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని మారేడుబాక పంచాయతీ ఊర్లాకులపాడు, జి.శరభవరం, కోసూరివారి వీధి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కోసూరివారి వీధిలో చిన్నారి తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించాలని ఊర్లాకుల పాడులో అంగన్వాడి భవనం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్ తొంట ఆదిరాజు, ఎంపీడీవో బాపన్న దొర, డిప్యూటీ తాహాసిల్దార్ అల్లు సత్యనారాయణ, ఈఓపిఆర్డి వెంకట శ్రీనివాస్ రావు, పలు పంచాయితీల సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.










