Oct 26,2023 22:38

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ పెద్ద మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేదదల పాధిని ఎంఎల్‌ఎ ద్వారంపూడి దెబ్బకొట్టి తను అనుచరులకు లబ్ధి చేకూరిస్తున్నారని సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి ఆరోపించారు. పెద్ద మార్కెట్లో నెలకొన్న సమస్యలపై గురువారం కొండబాబు వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. మార్కెట్లో నెలకొన్న పలు సమస్యలను వ్యాపారస్తులు కొండబాబు దృష్టికి తీసుకువచ్చారు. 1930లో నిర్మించిన పెద్ద మార్కెట్‌ గోడను ఎంఎల్‌ఎ అనుచరులు పగలకొటాన్రి చెప్పారు. రోడ్డున అనుకుని వ్యాపారాలు చేసుకుంటూ అనేక కుటుంబాలు జీవనం కొనసాగిస్తుండగా, మార్కెట్‌ సమస్య కోర్టులో ఉండగా మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన మార్కెట్‌ గోడను కాకినాడ ఎంఎల్‌ఎ ద్వారంపూడి ప్రధాన అనుచరుడు డేగల శ్రీరామ్‌ తొలగించాడన్నారు. దీని కారణంగా ఎన్నో ఏళ్లుగా రోడ్డుకి అనుకునే వ్యాపారం నిర్వహించుకుంటున్న పలు కుటుంబాలు ఉపాధి కోల్పోయినట్టు చెప్పారు. పెద్ద మార్కెట్‌లో గంజాయి బ్యాచ్‌ పెరిగిపోయిందరన్నారు. వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ వ్యాపారులు దేవర మహేష్‌, ఇర్రి సుధాకర్‌, గిద్దా శేఖర్‌, టేకుమూడి సుబ్బారావు, రాము, సన్నీబాబు, నిమ్మకాయల శ్రీను, బూరయ్య, నాగరాజు, గడ్డి సత్యనారాయణ, కొండ, అడపా గోపాలకృష్ణ, గండిమేను రాము, మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, ఒమ్మి బాలాజీ, చింతలపూడి రవి, బంగారు సత్యనారాయణ, రెడ్నం సత్తిబాబు, కోడూరు పెద్ద, అమలకంటి బలరాం పాల్గొన్నారు.