
ప్రజాశక్తి - ఆచంట
పేద ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తున్న జగన్‌కు అందరూ అండగా నిలవాలని ఎఎంసి ఛైర్మన్ చిల్లే లావణ్య అన్నారు. స్థానిక రామేశ్వరస్వామి కళ్యాణ మండపంలో వైసిపి మండల అధ్యక్షులు జక్కంశెట్టి చంటి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌కు జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బ Ûంగా లావణ్య మాటాడారు. ఈ కార్య క్రమంలో మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్, ఆచంట, పెదమల్లం సర్పం చులు కోట సరో జినీ వెంకటేశ్వరరావు, దిరిశాల విజయలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు ఎల్లమెల్లి బేబి, గ్రామ కమిటీ అధ్యక్షులు పి.సత్యనారాయణ, సచివాలయ కన్వీనర్ వేళ్ల వెంకట బాలాజీ, టౌన్ కార్యదర్శి ముత్యాల నాగేశ్వరరావు, గొల్లపల్లి బాబూరావు, దేవస్థానం ఛైర్మన్ నెక్కంటి రామలిం గేశ్వరరావు, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుమంట్ర : మండలంలోని బ్రాహ్మణచెరువు సాయినాథ కళ్యాణ మండపంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంపై ఎంపిపి, జెడ్‌పిటిసి సభ్యులు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్, సచివాలయ కన్వీనర్లు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, గృహ సారధులు, మండలంలోని వివిధ దేవస్థానాల కమిటీ మెంబర్లు, సొసైటీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులకు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రు.