Apr 13,2023 00:18

ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం: గతంలో ఉన్న సంక్షేమ పథకాలు తీసివేసి పేదల నడ్డి విరిచిన ఘనత వైసీపీకి దక్కుతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పుడు వైసీపీ ఇచ్చేది సంక్షేమ కాదు, కేవలం లంచం అని ఆయన విశ్లేషించారు. రంజాన్‌ సందర్భంగా ఇఫ్తార్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన చర్చాగోష్టిలో మాట్లాడారు. ప్రజల సొమ్ముతోనే జగన్‌ పార్టీ సొంత కార్యక్రమాలు చేయటం బాధాకరమని పేర్కొన్నా రు. పేదలకు రూపాయి ఇచ్చి పది రూపాయలు దోచుకునే ఘనత సిఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. మైనారిటీలకు పథకాలు లేకుండా చేసి ప్రేక్షకపాత్ర వహిస్తున్నాడని విమర్శించారు. రంజాన్‌ మాసంలో టీడీపీ హయంలో తోఫా అందచేసి పేద, ధనిక భేదం లేకుండా సంక్షేమం అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుం దని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు దేవుడు అయితే జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు రాక్షసుడిగా తయారయ్యారని అన్నారు. వైసిపికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాం, మీరా, సోహరబ్‌ హారఫట్‌, సలాం నియాజ్‌, చీరాల టీడీపీ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య, బాపట్ల ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర, గుంటూరు1 టీడీపీ ఇన్‌ఛార్జి నసీర్‌ అహ్మద్‌, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
చర్చా గోష్ఠిలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ