మాట్లాడుతున్న డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు
పేదల ముఖంలో చిరునవ్వే లక్ష్యం
కొడవలూరు:పేదల ముఖంలో చిరునవ్వే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు స్పష్టం చేశారు. కొడవలూరులో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద శాతం మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల్లో 99.50 శాతం మందికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఏమైనా సాంకేతిక.. కారణాలతో అందని అరకొర లబ్ధిదారులకు పథకాలందించడమే లక్ష్యంగా సురక్ష కార్యక్రమం కొనసాగుతోందన్నారు. దీనికితోడు జనన, మరణ, కుల, కుటుంబ తదితర 11 రకాల సర్టిఫికెట్లను కూడా ఉచితంగానే ఇంటి వద్దే అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో అన్నీ వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.సుబ్రమణ్యం, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, డీటీ గున్నం మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శులు జి.రాధాకష్ణ, జి.జాలయ్య, విఆర్‌ఒ రఘురామ్, వలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










