Nov 04,2023 21:28

పేదల ఇళ్లు కూల్చివేత

పోరుమామిళ్ల : మండలంలోని జి.బి.నగర్‌ కాలనీలో సుమారు 20 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం జెసిబిలతో అక్ర మంగా కూల్చివేశారు. ఇళ్లు కూల్చివేతతో పేదలకు రూ.50 లక్షల వరకు నష్టం కలిగించారు. మహిళలు, వృద్ధులు ఇళ్లు కూల్చవద్దని, తమను నిరాశ్రయులను చేయవద్దంటూ తహ శీల్దార్‌కు వేడుకున్నా పట్టించుకోకుండా కూల్చివేశారు. బాది óతులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలనీ వాసులు పనికి వెళ్లిన సమయంలో తహశీల్దార్‌ పోలీసులను వెంట తీసుకుని వచ్చి గుంటూరు బాపనయ్య కాలనీలోని ఇండ్లను డోజర్‌లతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న సిపిఎం మండల కార్యదర్శి భైరవప్రసాద్‌ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జెసిబికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఆయనను పోలీ సులు పక్కకు లాగేసి పోలీసుస్టేషన్‌కు తరలి ంచారు. పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు బాపనయ్య కాలనీ వాసులకు 20 సంవత్సరాల నుండి పట్టాల మంజూరు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో రాస్తా రోకోలు, ధర్నాలు చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరి గిన విషయం తెలిసిందే. అంతా తెలిసి కూడా తహ శీల్దార్‌ ప్రభుత్వ ఆదేశా లున్నాయంటూ ఇళ్లను కూల్చి వేశారు. నిరాశ్ర యులైన వారిలో ఎక్కువగా గిరిజనులు, దళితులు ఉన్నారు.
నా ఇంటిని కూల్చేశారు
20 సంవత్సరాల నుండి కాలనీలో జీవనం కొన సాగిస్తున్నాం. కూలి చేసుకుంటే తప్ప జీవనం సాగదు. అలాంటి తాము ఇళ్లు కట్టుకుంటే రెవెన్యూ అధికారులు అక్ర మంగా కూల్చివేశారు. అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
- కొడవటి గంటి మేరీ, జి.బి.నగర్‌ కాలనీ.
అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా
అప్పు చేసి కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. ఇంటిని కూల్చివేయడంతో తాము ఏ విధంగా జీవించాలి. ఎక్కడ తల దాచుకోవాలి. మాకు ప్రస్తుతం ఎక్కడా ఇల్లు లేదు. ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలి.
- షేక్‌ బేబీ, జి.బి.నగర్‌ కాలనీ.
పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం
పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడం దుర్మార్గం. నిరుపేదలు కాలనీలో జీవనం కొనసాగిస్తుంటే ప్రభు త్వం ఇలా చేయడం సరికాదన్నారు. కూలి చేసుకుంటూ పేదలు ఇళ్లు కట్టుకుంటే రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వెంటనే పేదలకు అక్కడే పక్కా ఇళ్లను నిర్మించాలి. అధికారుల తీరుపై సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తాం.
- ఎన్‌.భైరవ ప్రసాద్‌, మండల కార్యదర్శి, సిపిఎం.