Nov 05,2023 21:24

అంబేద్కర్‌ విగ్రహం వద్ద వంటా వార్పు చేస్తున్న బాధితులు

పోరుమామిళ్ల : పేదల ఇళ్లను కూల్చిన తహశీల్దార్‌ గంగయ్యను వెంటనే సస్పెండ్‌ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి. అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం అంబేద్కర్‌ విగ్రహం ముందు సిపిఎం మండల కార్యదర్శి ఆధ్వర్యంలో బాధితులు వంటా వార్పు కార్యక్రమంతో తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జి.బి (గుంటూరు బాపనయ్య) నగర్‌ కాలనీలో నివాసం ఉన్న పేదలకు పట్టాలు మం జూరు చేయకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. అప్పుసొప్పు చేసి కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని వాపోయారు. కూల్చిన ఇళ్లకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రంగసముద్రం రెవెన్యూ పొలంలో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించడం, బోగస్‌ పట్టాలు సృష్టించడం, ప్లాట్లు వేసి చట్ట విరూద్ధంగా విక్రయిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం తగదన్నారు. పోరుమామిళ్ల చుట్టం ప్రక్కల గ్రామాల్లో పేదలు ఉపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే అధి కారులు పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పిం చాల్సింది పోయి పోలీసుల సాయంతో కూల్చి వేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పట్టణానికి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మి కులు, హమాలీలు, తోపుడు బండి కార్మికులు, పేదలు సిపిఎం అండతో ఇళ్లు నిర్మించుకోవడం తప్పా అని పేర్కొన్నారు. పేదల ఇళ్లను కూల్చిన రెవెన్యూ అధికారి వైఖరికి నిరసనగా సోమవారం తహశీల్దార్‌ కార్యాలంయ ఎదుట ధర్నా నిర్వహి ంచనున్నట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంక టేష్‌, అవాజ్‌ జిల్లా అధ్యక్షుడు చాంద్‌ బాషా, బాది óతులు గురమ్మ, లక్ష్మి దేవి, సుధాకర్‌ ,రమణయ్య, నాగయ్య, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు షేక్‌ గౌసియాబేగం, బీబీ, లూర్దుమేరీ, వరలక్ష్మీ, ఆటో యూనియన్‌ మండల కార్యదర్శి చిన్నయ్య, చిన్నప్ప, ప్రసాద్‌ సుందరయ్య, కంటా శ్రీను వంటశీను, ప్రసాదు,రత్నం బాలగురయ్య, మున్నీ, మాబున్నీ, కాలనీవాసులు పాల్గొన్నారు.