Dec 08,2022 22:41

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
   కీర్తిశేషులు డాక్టర్‌ కె.రమణకుమార్‌ పేదల డాక్టర్‌గా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పేరొందారని కొయ్యలగూడెం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు చిటికిన రమేష్‌ అన్నారు. కన్నాపురం రోడ్డులోని తహశీల్దార్‌ కార్యాలయం పక్కన ఉన్న ఎంపిపి స్కూల్‌ (మెయిన్‌)లో రమణకుమార్‌ వర్థంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆశయాలను కుమారుడైన సురక్ష హాస్పిటల్‌ అధినేత కె.దిలీప్‌కుమార్‌ అనుసరిస్తూ ఏజెన్సీ ప్రాంత వాసులకు ఉచితంగా వైద్య చికిత్స చేస్తున్నారన్నారు. ఐదేళ్ల నుంచి పేదలైన వారికి వైద్య చికిత్సతో పాటు, ఆపరేషన్లు, ఔషధాలు కూడా దిలీప్‌కుమార్‌ ఉదారంగా అందించారని ప్రశంసించారు. అనంతరం 150 మందికి పైగా అన్నార్తులకు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు చిటికిన రమేష్‌, వీరవరపు నివాస్‌, ఎస్‌కె అలీమ్‌, కండెల్లి శివ, మడుతూరి శ్రీనివాస్‌, ప్రేమ్‌నాయుడు పాల్గొన్నారు.