
వీరబల్లి : జగనన్న సురక్షతో పేదల చెంతకే వైద్యసేవలు అందుతు న్నాయని ఎంపిపి గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని ఒదివీడు పంచాయతీ గ్రామ సచివాలయం దగ్గర సర్పంచ్ పోరుమామిళ్ల శంకరమ్మ తనయుడు శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల క్షేమం కోసం కషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి శ్రీదేవి, ఎంపిడిఒ మల్లేశ్వరి, మండల స్పెషల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, మండల వైసిపి నాయకుడు వీరనాగిరెడ్డి, స్థానిక నాయకులు శివ, సుబ్బరా మరాజు పాల్గొన్నారు. సుండుపల్ల్లి : ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మో హన్‌రెడ్డి అమలు చేస్తున్నారని మండల వైసిపి నాయకులు పేర్కొన్నారు. మండలంలోని ముడుంపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు ఎం.రామ స్వామి రెడ్డి, జడ్‌పిటిసి బిఇస్మాయిల్, ఎంపిపి రాజమ్మ, జెసిఎస్ కన్వీనర్ రెహమాన్‌ఖాన్, సర్పంచ్ ఎం.రాణిమ్మ ,సుండుపల్లి-1 ఎంపిటిసి, నసీమ భాను,టి.సుండుపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ సల్మాన్, రాష్ట్ర బిసి డైరెక్టర్ రాజు, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌లు పాల్గొన్నారు. బి.కొత్తకోట: జగనన్న ఆరోగ్య సురక్ష ఓ బహత్తర కార్యక్రమ మని ఎంపిపి లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. గురువారం మండలంలోని బీరంగి పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులను అందిం చారు.ఈ సందర్భంగా ఎంపిపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరుపేదల సంక్షేమానికి అలుపెరుగని కషి చేస్తున్నారని, అందుకోసం అనేక వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి రామ చంద్రయాదవ్, మండల ప్రత్యేక ఆహ్వానితులు రామిరెడ్డి, కో-ఆప్షన్ నెంబర్ ఎస్.నాసిర్‌వలి, బీరంగి సర్పంచ్ వెంకటరమణ, గుడిపల్లి సర్పంచ్ గిరిజ, తహసిల్దార్ రఫీక్ అహ్మద్, ఎంపిడిఒ శంకరయ్య, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గాలివీడు : ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంక ల్పంతో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని వైస్ ఎంపిపి-1 మిట్టపల్లి యదుభూషణరెడ్డి పేర్కొన్నారు. కొర్ల కుంటలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వైద్యులు రోగులను పరీక్షించి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి జల్లా పద్మావతమ్మ, వైస్ ఎంపిపి2 గాలి శ్రీనివా సులు, సర్పంచ్, ఎంపిడిఒ శేఖర్‌నాయక్ మండల కన్వీనర్ వెంక ట్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తంబళ్లపల్లి :మండల పరిధిలోని పరసతోపు పంచాయితీలో సర్పంచ్ పర్వతమ్మ , ఎంపిటిసి సభ్యులు సరోజమ్మ కరీం ల ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రజల ఆరోగ్యమే ఆశయంగా వినూత్న తరహాలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. డాక్టర్లు అనుపమ, ఆశాలతలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అభివద్ధి కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ చౌడేశ్వర్, ఎంపిడిఒ సురేంద్రనాథ్, శ్రీనివాసులు,రామ్మూర్తి పాల్గొన్నారు. కలకడ: మండలంలోని బాలయ్యగారిపల్లి పంచాయతీ ఎర్రయ్యగారిపల్లెలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక సచివాలయం ఆవరణలో ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి రవిచంద్ర, ఇఒపిఆర్‌డి లతీఫ్ ఖాన్, వైద్యాధికారులు మోహన్ ,జవహర్‌బాబు, కరీముల్లాబాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: మదనపల్లె మండలం కొత్తపల్లి-1 గ్రామపంచాయతీ ఎంపియుపి పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి సిడిపిఒ సుజాత, ఎంపిటిసి దేవేంద్ర,ఎంపిడిఒ భాను ప్రసాద్, సచివాలయం స్పెషల్ ఆఫీసర్ చంద్ర కాంతమ్మ, వైసిపి కన్వీనర్లు మహేష్, నాగరాజులు హాజరయ్యారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది,వాలంటరీలు, ఎఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.