పేదల భూములు వారికే ఇవ్వాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వారికే అందించాలని రైతుసంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట భయభ్రాంతులకు గురైన కొండ కింద గ్రామ బాధిత రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ మా అనుభవంలో ఉన్న భూములను దేవుడి పేరు చెప్పుకుంటూ రాములమ్మ అనే అమే ఆక్రమించేందుకు చేస్తున్న కుట్రలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. మా భూములు మాకు చెందకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ తహశీల్దార్ కార్యాలయం దద్దరిల్లేరా నినాదాలు చేశారు. కొందరు పెత్తందారుల కనసన్నల్లో జరుగుతున్న ఈ దౌర్జన్యాలను అరికట్టే దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని అర్హులైన వారికి వారి భూములను వారికి చెందేలా చూడాలని తహశీల్దార్ జగదీష్ బాబుకు వివరించి వినతిపత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించిన తహశీల్దార్ సమయం ఇస్తే రికార్డులను పరిశీలించి 28న ఇరువురిని పిలిపించి నివేదికను తయారు చేసి జిల్లా ఉన్నతి అధికార్లకు పంపుతామని తెలిపారు. వారి నిర్ణయంపై చర్యలు తీసుకుంటామని బాధిత రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో పెద్దఎత్తున బాధిత రైతులు మహిళలు పాల్గొన్నారు.










