కడప అర్బన్ : ఒంటిమిట్ట,పెండ్లిమర్రి మండలాల్లోని దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న భూ ములకు అసైన్‌మెంట్ కమిటీలో పట్టాలు మంజురు చేయాలని భూపొరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ బి.నారాయణ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్‌డిఒ కార్యాలయం ముందు ఒంటిమిట్ట, పెండ్లి మర్రి మండలాల భూములు సాగులో ఉన్న లబ్ధిదా రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా నారాయణ మాట్లాడుతూ ఒంటిమిట్ట, సిద్ధవటం, పెండ్లిమర్రి, మండలాల స్థానిక పేదలకు సెంటు భూమి అసైన్‌మెంట్ కమిటీలో ఇవ్వలే దన్నారు. స్థానిక ఎమ్మెల్యేల అను చరులకు, అనర్హులకు ప్రభుత్వ భూములను అప్పజెప్పారని విమ ర్శించారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకో వాలని రెవిన్యూ అధికారులకు అనేక దపాలుగా ఆందోళన రూపంలో వినతిపత్రాలు ఇచ్చిన అధికారులు వాటిని విస్మరిం చడం దారుణమని పేర్కొన్నారు. ఎండ్లతరబడి పేదలు సాగులో ఉన్నప్పటికి అసైన్‌మెంట్ పట్టాలు మంజురుచేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం అసైన్‌మెంట్ కమిటీలో స్థానిక దళితులు,పేదలకు పట్టాలు మంజురు చేయాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 2050లో పేదలు భూములు సాగు చేసు కుంటున్నారని తెలిపారు. పెండ్లిమర్రి మండలం పెద్దశెట్టిపల్లె రెవిన్యూ పొలం సర్వే నంబర్ 330లో యల్లటూరు, పెండ్లిమర్రి ప్రాంతాల ఎస్సీ, ఎస్టీలు రూ.4 ఖర్చు చేసి భూములనుసాగులోకి తెచ్చారని చెప్పారు. అటువంటి భూములకు పట్టాలు మంజూరు చేయటంలో నిర్లక్షం వహిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే సాగులో ఉన్న పేదలందరికి పట్టాలు మంజురు చేయలని డిమాం డ్ చేశారు. అనంతరం ఆర్‌డిఒ ధర్మచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శివకుమార్, వి.అన్వేష్, ఉపాధ్యక్షులు నరసయ్య, సురేష్ బాబు, ఒంటిమిట్ట నాయకులు, రాము, హరి, పెండ్లిమర్రి మండల నాయకులు మల్లేశ్, ముత్తయ్య, అయ్యవారయ్య, పార్వతి, అమ్ములమ్మ, సుమతి పాల్గొన్నారు.










