Jul 13,2023 00:50
పీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు

ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. మండలంలోని విశ్వేశ్వరం గ్రామంలో రూ.2.36 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీ భవన సముదా యాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లా డారు. ఆరోగ్యం బాగలేక చికిత్సలు పొందలేని పేదలకు వైద్యానికై ఆరోగ్యశ్రీ పథకాన్ని నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారని, ఆయన బాటలోనే ఆయన తనయు డు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అభివృద్ధి చేసి పేదలకు మరింత చేరువచేశారని అన్నారు. రూ.1,000 దాటి చికిత్సలు చేయించుకునే అనేక వ్యాధులు ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా పథకాన్ని విస్తరింప జేశారన్నారు. ప్రజారోగ్యం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి విజయమ్మ, వైసీపీ రూరల్‌ కన్వీనర్‌ గాదె వెంకయ్యబాబు, జడ్పీటీసీ బొర్రా లక్ష్మీ శ్రీనివాసరావు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మండలి అంజయ్య, సర్పంచ్‌ కే శివనాగమల్లేశ్వరరావు, ఎంపీటీసీ మేడికొండ సుధాకర చంద్రహాసరావు తదితరులు పాల్గొన్నారు.