Oct 20,2023 20:32

మందులను పంపిణీ చేస్తున్న సర్పంచి, అధికారులు

ప్రజాశక్తి - నందవరం
పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని ముగతి సర్పంచి, వైసిపి బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు విరుపాక్షి రెడ్డి, ఎంపిడిఒ దశరథ రామయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని ముగతిలో మొదటి రోజు సచివాలయం-2లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 465 మంది వారి ఆరోగ్య సమస్యలపై సంప్రదించారని తెలిపారు. అందులో 258 మంది మహిళలు, 207 మంది పురుషులు, 40 మంది బడి పిల్లలు ఉన్నారన్నారు. 17మంది గర్భిణులు, 46 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, 15 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డాక్టర్లు టి.పరిమళ, డాక్టర్‌ టి.శైలవాను, డాక్టర్‌ పి.సౌజన్యలత పాల్గొన్నారు.