Oct 07,2023 17:46

ఎమ్మిగనూరులో మాట్లాడుతున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని శివన్న నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 'జగనన్న ఆరోగ్య సురక్ష'కు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రఘు, వైస్‌ ఛైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌, కమిషనర్‌ గంగిరెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బుట్టా రంగయ్య, టౌన్‌ బ్యాంకు ఛైర్మన్‌ రాజు పాల్గొన్నారు. గోనెగండ్లలోని సచివాలయం -1 పరిధిలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరాన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్‌ మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ న్యూటన్‌, అమీలియో హాస్పిటల్‌ పీడియాట్రిక్‌ డాక్టర్‌ విజయశ్రీ, స్థానిక వైద్యులు డాక్టర్‌ అపర్ణ, డాక్టర్‌ కార్తీక్‌ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మండల కోఆప్షన్‌ మాజీ సభ్యులు, వైసిపి యూత్‌ లీడర్‌ టి.బందే నవాజ్‌, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపిడిఒ ప్రవీణ్‌ కుమార్‌, సర్పంచి హైమావతి, ఇఒఆర్‌డి నగేష్‌, ఎఒ బాబు భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి సతీష్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ విరుపాక్షి, బగిలి ఉస్మాన్‌, కనికే పద్మనాభం, బగిలి రఫీ, ఎంపిహెచ్‌ఒ హనుమంతు, సూపర్‌వైజర్‌ పరమేష్‌ పాల్గొన్నారు.

గోనెగండ్లలో వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్న సర్పంచి హైమావతి
గోనెగండ్లలో వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్న సర్పంచి హైమావతి