Sep 12,2023 23:41

ప్రజాశక్తి - నగరం
కార్పొరేట్‌ వైద్యం అందుకోలేని పేదల కోసం ప్రభుత్వమే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తుందని ఎంపిపి చింతల సీనయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో చిన్నమట్లపూడి, ధూలిపూడి గ్రామాల పిహెచ్‌సి వైద్య అధికారులు, ఎఎన్ఎంలకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15నుండి ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకంపై అవగాహన కల్పించాలని కోరారు. బాధ్యతతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈపాటికే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సేవలందించిన అధికారులను అభినందించారు. వైద్య సిబ్బంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ నిర్వహణలో మండలానికి మంచి పేరు తేవాలని కోరారు. కరోన సమయంలో వైద్య సిబ్బంది చేసిన సేవలను గుర్తు చేస్తూ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్, ధూళిపూడి పిహెచ్సి డాక్టర్ భవాని, చినమట్లపూడి పిహెచ్ సి డాక్టర్ పి తులసి రాజెశ్వరి,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు