
ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. గురువారం మున్సిపాలిటీలోని మల్లంపేటలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి ఆయన హాజరయ్యారు. ముందుగా వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి, అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు. పేదల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, ఖరీదైన మందులను అందజేస్తూ వారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, బుడా ప్రతినిధి ఇంటి గోపాలరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు తెంటు పార్వతి, కొర్లపు రామారావు, వైసిపి నాయకులు పోల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
నూతన భవనాలు ప్రారంభం
బొబ్బిలిరూరల్ : మండలంలోని అలజంగి గ్రామ సచివాలయాన్ని, శివడవలసలో సచివాలయ, ఆర్‌బికె నూతన భవనాలను ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మి, వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి సంకిలి శాంతకుమారి, సర్పంచ్ రేజేటి భద్రమ్మ, జెసిఎస్ మండల కన్వీనర్ తమ్మిరెడ్డి దామోదర్, వైసిపి నాయకులు రేజేటి బుజ్జి, పూడి చిన్న, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.