సత్తెనపల్లి టౌన్: ప్రభుత్వ ఏరియా వైద్యశాలలొ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తే గతానికి ఇప్పటికి పూర్తిస్థాయి వ్యత్యాసం ఉందని, కార్పొరేట్ కు దీటుగా చిన్న పిల్లల వార్డును ఏర్పాటు చేశామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఏరియా వైద్యశాలలో గుండె వ్యాధుల అకాల మరణాల నివారణకు స్టెమి కార్యక్రమం, చిన్నారుల వైద్య విభాగ ప్రత్యేక అవార్డు, విశ్రాంతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవి ష్క రించారు. మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి భద్రత నిచ్చేలా గుండె జబ్బుల మరణాలను నివృత్తి చేసేలా ప్రభుత్వ వైద్యశాలలో రూ.40 వేల విలువైన ఇంజక్షన్లు ఉచితంగా అందించే ఈ కార్యక్రమం పేద వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాణా పాయం నుంచి తప్పిస్తుందన్నారు.
అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి హాస్పిటల్ అభివద్ధి కమిటీ ఎంతో సేవాభావంతో పనిచేస్తోందని అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా చిన్న పిల్లల వార్డు హాస్పిటల్ అబివృద్ధి కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆధునీకరించారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి అన్నారు. పాత్రికేయుల సమావేశంలో దీని గురించి వివరించారు. ప్రతి గ్రామం లోనూ వైద్య నిపుణులతో ప్రభుత్వమే నేరుగా వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి సాంబశివరావు, అచ్యుత శివప్రసాద్, హాస్పిటల్స్ సూపరింటెండెంట్ లక్ష్మణరావు, అర్ ఎం ఓ శోభారాణి, నర్సింగ్ సూపర్డెంట్ రాధ, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామకష్ణ, డాక్టర్ రాజమోహన్ రెడ్డి, డాక్టర్ గిరిజ, వార్డు కౌన్సిలర్సు, స్టాఫ్ నర్సులు, ఉద్యోగులు పాల్గొన్నారు.










