ప్రజాశక్తి-మైలవరం :
పేదల అకలి తీర్చేందుకు అన్న క్యాంటిన్లు నిర్వహిస్తున్నామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరంలో అన్న క్యాంటిన్ ప్రారంభమై 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటిన్లను తీసివేసి పేదల పోట్ట కొట్టిందన్నారు. అన్నంపెట్టే స్థలాల్లో మద్యం తాగేవారికి కేరాఫ్ అడ్రస్‌లుగా మార్చడం దారుణ మన్నారు. త్వరలో రాష్ట్రం అంతా అన్న క్యాంటిన్లను తిరిగి ప్రారంభి స్తామ నన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.










