May 10,2023 01:21
అన్నా క్యాంటీన్‌లో అన్నదానం

ప్రజాశక్తి-బాపట్ల: పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్లలో ఆరంభించిన అన్న క్యాంటీన్‌ 191వ రోజుకు చేరింది. మంగళవారం వేగేశన నరేంద్రవర్మ సహకారంతో 350 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.