ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో బాపట్లలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 182వ రోజుకు చేరింది. ఆదివారం చెరువు జమ్ములపాలేనికి చెందిన యార్లగడ్డ హాసిని స్మతులతో ఆమె తాతయ్య, నాయనమ్మ యార్లగడ్డ అంకమ్మ చౌదరి-వేదవతి సహకారంతో సుమారు 250 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేదల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై తమవంతు సహకారాన్ని అందిస్తున్న దాతలకు నరేంద్రవర్మ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి చీరాల ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










