Jun 16,2023 00:46

ఎమ్మెల్యే గణేష్‌కు స్వాగతం పలుకుతున్న మహిళలు

ప్రజాశక్తి-గొలుగొండ:పేదల ఆర్ధిక స్వావలంభనే ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. మండల పరిధిలో పాకలపాడు పంచాయతీలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ముందుగా గ్రామంలో అంబేద్కర్‌, వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నవరత్నాలు, పేదలకు ఇళ్లను పార్టీలతో సంబంధం లేకుండా అందిస్తున్నామన్నారు. విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముందుగా పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, మండల వైయస్సార్‌ పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షురాలు లోచల సుజాత, ఏఎసి చైర్మన్‌ కొల్లు సత్యనారాయణ, పిఎసిఎస్‌ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, యూత్‌ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, సేవాదళ్‌ అధ్యక్షులు రమేష్‌, గొలుగొండ మండల సచివాలయం కన్వీనర్లు అధ్యక్షులు పాణి శాంతారావు, స్థానిక సర్పంచ్‌ రాజాన పద్మ, పాకలపాడు వైసిపి ప్రెసిడెంట్‌ రమేష్‌, గొలుగొండ మండలం వైయస్సార్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రమణ పాల్గొన్నారు.
నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు లో గురువారం రెండవ రోజు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నం, జడ్పిటిసి కాసులమ్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు నానాజీ, ఈశ్వరరావు, నాయకులు శీరం నరసింహమూర్తి, శేషారత్నం తదితరులు పాల్గొన్నారు.