ప్రజాశక్తి - ముదినేపల్లి
సిఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు పేదల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. ముదినేపల్లిలో ఆదివారం గడపగడపకూ మనప్రభుత్వం కార్యక్రమం అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ఇంటింటికీ వెళ్లి వైసిపి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, పార్టీ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్‌ఎంపిపిలు సిహెచ్.సునీత, రాచూరి రాధా, వైసిపి మండల అధ్యక్షులు ఎం.ఏసుబాబు, గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ, వైసిపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు నిమ్మగడ్డ భిక్షాలు, పార్టీ శ్రేణులు శీలం రామకృష్ణ,రాజులపాటి సూర్యప్రసాద్, ఈడే వెంకటేశ్వరరావు, బొర్రా శేషుబాబు, బేతపూడి వెంకటరమణ పాల్గొన్నారు.










