Jul 03,2023 21:49

ఫొటో : మహిళలకు పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బిఎంఆర్‌

పేదల అభివృద్ధే సిఎం లక్ష్యం
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్రంలోని పేదల అభివృద్ధి, వారు కన్న కలలను నెరవేర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు, ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దయాకర్‌ రెడ్డి లేఅవుట్లకు సంబంధించి సుమారు 434 ఇంటి పట్టాలను మహిళలకు పంపిణీ చేశారు. ముందుగా వారి ఇరువురు రాజుల వీధిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగరవేసి కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఆ నేతలు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి విరివిగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు వివరించారు. గత తెలుగుదేశం హయాంలో అభివృద్ధి శూన్యమని జన్మభూమి కమిటీల పేరుతో అంతా దోచుకోవడం తెలిసిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 175కు 175సీట్లు సాధించి తీరుతామన్నారు. ప్రతి కుటుంబ అభివృద్ధి చెందాలనే దృక్పథంతో జగనన్న విద్యార్థులకు పెద్దపీట వేస్తూ అన్ని సమకూరుస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ దండా కృష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు నీలం సాయికుమార్‌, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ ఊటు శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపిపి దర్శిగుంట శశిరేఖ, జెడ్‌పిటిసి చలంచర్ల వేణమ్మ, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపిడిఒ శ్రీదేవి, నగర పంచాయతీ కమిషనర్‌ ఫణి కుమార్‌ తదితరులున్నారు.