May 06,2023 16:38

మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తున్న నాగిని రవి సింగారెడ్డి

పేదింటి మహిళల ఆర్థిక స్వావలంబనకు శిల్పా కుటుంబం నిరంతర సేవలు : నాగిని రవి సింగారెడ్డి
ప్రజాశక్తి, నంద్యాల కలెక్టరేట్

       పేదింటి మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు శిల్పా కుటుంబం నిరంతరంగా సేవలను అందిస్తుందని శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాలకు, గెలుపు ఓటములకు అతీతంగా శిల్పా సేవ సమితి ఆధ్వర్యంలో పలుసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.  శనివారం స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 169 మంది మహిళలకు 23 లక్షల 51వేల విలువగల చెక్కులను వారు  అందజేశారు. అలాగే శిల్పా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు, పేదింటి మహిళల ఆర్థిక స్వావలంభనకు, సాధికారతకు నిరంతరాయంగా, గెలుపు ఓటములను చూడకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నంద్యాల ప్రజల ఆశీర్వాదాలు ఆధార అభిమానులు ఎల్లప్పుడూ తమ కుటుంబంపై ఉన్నాయని, అలాగే చూపాలని కోరారు. రుణాలకు పొందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆర్థిక స్వాతంత్రం సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, తదితరులు పాల్గొన్నారు.
"శిల్పా సేవా సమితి" ఆధ్వర్యంలో ఉచిత వేసవి సంగీత శిక్షణ తరగతులు...
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరం చిన్నారుల్లో పెంపొందించేందుకుగాను శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి ఉచిత సంగీత శిక్షణ తరగతులను శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి ప్రారంభించారు.సంగీత శిక్షణలో 18 సంవత్సరముల అనుభవం కలిగిన సంగీత గురువు కళ్యాణిచే శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని నాగిని రవి సింగారెడ్డి కోరారు.ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ నేటి తరంలో చిన్నారులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తమ వంతుగా ఈ వేసవి కాలంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సంగీతంలో అపార అనుభవం కలిగిన కళ్యాణి సంగీత గురువులు చిన్నారులకు శిక్షణ అందిస్తారని పేర్కొన్నారు. సంగీతం నేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం  చేసుకోవాలని, తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నాగిని రవి సింగారెడ్డి
కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నాగిని రవి సింగారెడ్డి